![]() |
![]() |

యాంకర్ ఝాన్సీ ఏది చేసినా అందులో ఒక స్పెషాలిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఝాన్సీ ఈ మధ్య కాలంలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అలాగే తన అప్ డేట్స్ ని షేర్ చేస్తూ ఫాన్స్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. అలాంటి ఇప్పుడు మేస్త్రిగా అవతారమెత్తింది. అదేంటి అనుకుంటున్నారా..ఝాన్సీ ఒక గమేళాలో మట్టి పట్టుకొస్తే మరో అమ్మాయి భాను గోడ మీద పెయింట్ బ్రష్ తో బొమ్మలు వేస్తోంది. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.
"నా డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం మా అమ్మాయిలంతా తమ హృదయాల్లో ఉన్న కళను బయటపెట్టడం కోసం మట్టి, సున్నంతో ప్రయోగాలు చేసి చెరువును . అందులో తామర పూలను సృష్టిస్తున్నారు" అని కాప్షన్ పెట్టింది ఝాన్సీ. ఈ వీడియోకి నటి ప్రగతి హార్ట్ ఇమేజెస్ ని పోస్ట్ చేస్తే, మిగతా వాళ్లంతా ఈ ఏరియా ఎక్కడ, చెప్పక్కర్లేదు..మంచి ఆర్ట్ రూపుదిద్దుకుంటోంది...ఈ ఆర్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చూసున్నాం..." అంటూ రిప్లైస్ ఇస్తున్నారు. ఈ వీడియోలో ఝాన్సీ "వాబిసాబి ఆర్ట్ ని ఇక్కడ ప్రెజంట్ చేస్తున్న ఫస్ట్ ఆర్టిస్ట్..సుర్కి లోటస్ అండ్ సం గోబర్ లీవ్స్" అంటూ చెప్పింది.
వాబిసాబి అనేది జాపనీస్ ఆర్ట్ స్టైల్. ఇక ఝాన్సీ తన పెరట్లో పెంచుకునే కూరగాయలను వీడియోస్ చేసి తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది. అలాగే నాటకాలు కూడా రాస్తూ ఉంటుంది. రీసెంట్ "టిట్ ఫార్ టాట్" అనే నాటకాన్ని రాసి డైరెక్ట్ చేసింది ఝాన్సీ. ఇక ఝాన్సీని నందిని రెడ్డి కూడా పొగిడింది. అంతేకాదు అప్పుడప్పుడు మోటివేషనల్ లైన్స్ కూడా చెప్తూ ఎవరినీ జడ్జ్ చేయకండి..కుదిరితే మంచిగా ఉండండి లేదంటే లేదు అని కూడా కొంచెం ఘాటుగానే చెప్తుంది ఝాన్సీ. ఈమధ్య ఝాన్సీ మూవీస్ లో మంచి కీ రోల్స్ లో నటిస్తోంది. సాలార్, మిస్ పర్ఫెక్ట్ మూవీస్ ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
![]() |
![]() |